|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 11:32 AM
ఢిల్లీ నగరం తీవ్ర వాయు కాలుష్యంతో అల్లాడుతోంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచిక (AQI) 450 మార్క్‌ను దాటింది. అశోక్ విహార్‌లో ఏక్యూఐ 500గా, ఆనంద్ విహార్, అక్షర్ ధామ్ ప్రాంతాల్లో 493గా నమోదైంది. ద్వారకాలో 469, నోయిడాలో 454గా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు 8.2 డిగ్రీలకు పడిపోవడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గి, విమాన, రైలు ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది.
Latest News