|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:36 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు (సోమవారం) హస్తినలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో వేర్వేరుగా సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై వారిద్దరితో లోకేశ్ చర్చించనున్నారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ రోజు ఉదయం విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్న లోకేశ్..కేంద్ర మంత్రులతో సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా విశాఖపట్నం వెళ్లనున్నారు. రేపు విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
Latest News