|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:58 PM
అమెరికాలో విజయవంతమైన కెరీర్ తర్వాత రూ.100 కోట్ల నికర సంపదతో భారత్‌కు తిరిగి వచ్చిన ఓ ఎన్నారై తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్థికంగా స్వేచ్ఛ లభించినప్పటికీ, ముందస్తు రిటైర్మెంట్ జీవితంలో తనకు ఎదురవుతున్న మిశ్రమ భావాలను ఆయన రెడిట్ పోస్ట్‌లో వివరించారు. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, మొదట ఓ సర్వీస్ కంపెనీలో చేరి, తర్వాత కోర్ టెక్నాలజీలోకి, ఆపై అమెరికాకు వెళ్లానని ఆయన తెలిపారు. అక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా తన సంపదను పెంచుకున్నట్లు చెప్పారు. "గత కొన్నేళ్లుగా మా స్టాక్ పోర్ట్‌ఫోలియో అద్భుతంగా పెరిగింది. ప్రస్తుతం మా సంపద 12 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.100 కోట్లకు పైగా) చేరింది. ఈ సంఖ్యను నేను ఎప్పుడూ ఊహించలేదు" అని ఆయన రాసుకొచ్చారు.ప్రస్తుతం ఉద్యోగం మానేసి ఇండియాలో ఉంటున్నానని, ఈ స్వేచ్ఛ ఎంతో బాగున్నా కొన్నిసార్లు సవాల్‌గా అనిపిస్తోందని ఆయన అన్నారు. ఓ మంచి గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తూ తన రోజువారీ జీవితం ఆరోగ్యం, కుటుంబం చుట్టూనే తిరుగుతోందని చెప్పారు. రోజూ కనీసం 3 గంటలు స్పోర్ట్స్ లేదా జిమ్‌లో గడపడం, పుస్తకాలు చదవడం, టీవీ సీరియళ్లు చూడటం, కుటుంబంతో సమయం గడపడం వంటివి చేస్తున్నట్లు వివరించారు.
Latest News