|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 01:05 PM
క్రీడా ప్రపంచంలోని దిగ్గజాలైన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ ఒకేచోట కలిశారు. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో వీరిద్దరి అరుదైన భేటీ జరిగింది. ఈ కలయిక క్రీడాభిమానులకు కనుల పండుగ చేసింది. దేశ క్రీడా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. మెస్సీతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. "ఈ రోజు నిజంగా 10/10 డే, లియో మెస్సీ" అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.
Latest News