|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 01:21 PM
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుత మండల యాత్రా సీజన్‌లో స్వామివారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య ఇప్పటికే 25 లక్షలు దాటింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని అధికారులు తెలిపారు. రద్దీ పెరిగినప్పటికీ, పటిష్ఠమైన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు సజావుగా సాగుతున్నాయని శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్, ఏడీజీపీ ఎస్. శ్రీజిత్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.గతేడాది ఈ సమయానికి సుమారు 21 లక్షల మంది భక్తులు రాగా, ఈసారి ఆ సంఖ్య 25 లక్షలు దాటిందని ఆయన తెలిపారు. యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లో అధిక రద్దీ కనిపించినా, సకాలంలో తీసుకున్న చర్యలతో పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు. వర్చువల్ క్యూ పాసులలో కేటాయించిన తేదీల్లో కాకుండా వేరే రోజుల్లో భక్తులు రావడమే ప్రాథమికంగా రద్దీకి కారణమని ఆయన స్పష్టం చేశారు. కేటాయించిన తేదీల్లోనే వస్తే అందరికీ సౌకర్యవంతంగా దర్శనం లభిస్తుందని సూచించారు.
Latest News