|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 01:24 PM
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపశ్యన ధ్యానంపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యంగ్యాస్త్రాలు వివాదానికి దారితీశాయి. తనను విమర్శించడానికి బుద్ధుడు బోధించిన పవిత్రమైన విపశ్యన ధ్యానాన్ని ఎగతాళి చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని కేజ్రీవాల్ హితవు పలికారు.గతవారం జరిగిన ఓ కార్యక్రమంలో రేఖా గుప్తా మాట్లాడుతూ.. "మేము ఢిల్లీలోనే ఉంటూ కాలుష్య సమస్యకు పరిష్కారాలు వెతుకుతున్నాం. ఆరు నెలలకోసారి ఢిల్లీని గాలికి వదిలేసి, దగ్గు తగ్గించుకోవడానికి విపశ్యనకు పారిపోయే వాళ్లలాంటి వాళ్లం కాదు" అని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. "మీకు నాపై రాజకీయ శత్రుత్వం ఉండొచ్చు. కానీ, గౌతమ బుద్ధుడు బోధించిన పవిత్రమైన విపశ్యన ధ్యానాన్ని ఈ విధంగా అవహేళన చేయడం మీకు తగదు" అని పేర్కొన్నారు. విపశ్యనకు వెళ్లడం పారిపోవడం కాదని, అది అదృష్టవంతులకు మాత్రమే లభించే గొప్ప అవకాశమని, ప్రశాంతతను ఇస్తుందని ఆయన అన్నారు.
Latest News