|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 01:56 PM
సోమవారం సిఐటియు 18వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని సుందరయ్య కాలనీ సిఐటియు జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ పిలుపునిచ్చారు. పెదకాకాని శంకర కంటి వైద్యశాల వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈనెల 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే ఆలిండియా సిఐటియు మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కొల్లికొండ ఏడుకొండలు, బి సాంబయ్య, కే రాఘవయ్య పాల్గొన్నారు.
Latest News