|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 02:35 PM
పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) జరుగుతోంది. ఇందులో భాగంగా 58 లక్షలకు పైగా ఓట్ల తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మృతులు, స్థానచలనం చెందినవారు, సంప్రదించడానికి సాధ్యపడనివారు, ఇతర కారణాల దృష్ట్యా ఈ పేర్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదివారం సాయంత్రం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణను ప్రారంభించింది. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 2026లో ప్రచురిస్తారు.
Latest News