|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 03:13 PM
ముంబై సమీపంలోని బడ్లాపూర్‌లో ఓ సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ మహిళా నేత నీర్జా ఆంబేకర్‌ను ఆమె భర్త రూపేశ్ ఆంబేకరే, ముగ్గురు సహచరులతో కలిసి విష సర్పంతో కాటేయించి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2022లో పాము కాటుతో మరణించినట్లు భావించిన ఈ కేసు, మూడేళ్ల తర్వాత మరో హత్యాయత్నం కేసులో నిందితుడిని విచారించగా, ఈ కుట్ర బయటపడింది. భర్త సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నీర్జా మృతదేహానికి పోస్టుమార్టం జరగకపోవడంతో కేసును అప్పట్లో మూసివేశారు.
Latest News