|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 12:41 PM
వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (16.12.2025) విజయవాడ నగరంలో పర్యటించనున్నారు. ఇటీవల విజయవాడ జోజినగర్ ఇళ్ళ కూల్చివేత బాధితులను వైయస్ జగన్ పరామర్శించనున్నారు. ఇటీవల విజయవాడ జోజినగర్‌లో అర్ధాంతరంగా కూల్చిన ఇళ్ళ బాధితులను మంగళవారం శ్రీ వైయస్ జగన్ పరామర్శించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఒంటిగంట ప్రాంతంలో జోజినగర్ వెళ్ళి బాధితులతో మాట్లాడనున్నారు. ఇళ్ళ కూల్చివేత బాధితులు ఇప్పటికే శ్రీ వైయస్ జగన్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిసి తమ ఇళ్ళను ప్రభుత్వం ఎలా కూల్చివేసిందో వివరించారు. ఈ క్రమంలో శ్రీ వైయస్ జగన్ నేరుగా ఘటనా స్ధలానికి వెళ్ళి ప్రత్యక్షంగా బాధితులను కలవనున్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Latest News