|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 02:57 PM
సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి రైల్వే శాఖ నుంచి నిరాశ తప్పలేదు. పండుగకు నెల రోజుల సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. ప్రస్తుతం ఏ రైలులో రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా భారీ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ కూడా దాటిపోయి 'రిగ్గ్రెట్' అని చూపిస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.ఉద్యోగ, వ్యాపారాల హడావిడిలో ముందుగా టికెట్లు బుక్ చేసుకోలేకపోయిన వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దాదాపు 12 గంటల సుదూర ప్రయాణం కావడంతో ఎక్కువ మంది రైళ్లకు ప్రాధాన్యతనిస్తారు. అయితే రెండు నెలల క్రితమే సాధారణ, ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
Latest News