|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 08:26 PM
అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారత స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది.రూ.2 కోట్ల కనీస ధరతో (Base Price) వేలంలోకి అడుగుపెట్టిన వెంకటేష్ అయ్యర్ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. తొలుత లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీ మధ్య బిడ్డింగ్ జరగగా, కొంతసేపటికి లక్నో పోటీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ బరిలోకి దిగింది.చివరి దశ వరకు కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరికి కేకేఆర్ వెనక్కి తగ్గడంతో వెంకటేష్ అయ్యర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది.గత ఐపీఎల్ 2025 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వెంకటేష్ అయ్యర్‌ను భారీగా రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే నిరాశాజనక ప్రదర్శన కారణంగా అతడిని విడుదల చేసింది. ఈ మినీ వేలంలో అతడిని తిరిగి దక్కించుకునేందుకు కేకేఆర్ గట్టిగానే ప్రయత్నించినప్పటికీ, చివరికి వెంకటేష్ అయ్యర్ ఆర్‌సీబీ ఖాతాలో చేరాడు.
Latest News