|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:32 PM
ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు ఈ సీజన్‌లో అదృష్టం తలొచ్చింది. అబుదాబిలో జరిగిన IPL 2026 మినీ వేలంలో మొదట అన్‌సోల్డ్‌గా మిగిలిన ఆయన, తర్వాత భారీ ధరకు అమ్ముడయ్యాడు.లివింగ్‌స్టోన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 13 కోట్ల రూపాయల బిడ్ వేసి జట్టు సొంతం చేసుకుంది. రెండవ రౌండ్‌లో అతడి కోసం లక్నో సూపర్ జెయింట్స్ కూడా పోటీపడ్డాయి, కానీ సరైన బడ్జెట్ లోపం కారణంగా వెనకడుగు వేసి, SRHకు అవకాశం వచ్చింది.రెండో రౌండ్‌లో భారత స్పిన్నర్ రాహుల్ చహర్ యూటర్న్‌లో అదృష్టాన్ని అందుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అతన్ని 5.20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. చహర్ కోసం పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి.ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 8.60 కోట్లకు సొంతం చేసుకుంది. కోల్‌కతా రైడర్స్ రచిన్ రవీంద్రను 2 కోట్లకు, ఆకాశ్ దీప్‌ను 1 కోట్లకు, చెన్నై మ్యాట్ హెన్రీని 2 కోట్లకు, హైదరాబాద్ శివమ్ మావిని 75 లక్షలకు, పంజాబ్ బెన్ డ్వార్ష్యుయిస్ 4.40 కోట్లకు, RCB జోర్డాన్ కాక్స్ 75 లక్షలకు, ఢిల్లీ లుంగి ఎంగిడిని 2 కోట్లకు సొంతం చేసుకుంది.తమిళనాడు కుర్రాడు అమన్ రావు పేరును రాజస్థాన్ 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.
Latest News