|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:47 PM
నిర్మిస్తున్నారు. ఈ అండర్ వాటర్ టన్నెల్ పూర్తి అయితే.. నార్వేలోని ప్రధాన నగరాలైన బెర్గెన్, స్టావాంగర్ మధ్య ప్రయాణ సమయం 40 నిమిషాలు తగ్గుతుందని అధికారులు వెల్లడించారు. అంటే ఇప్పుడు ఉన్న ప్రయాణ సమయంతో పోల్చితే సగానికి తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా నార్వే చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన (ఈ39) హైవే ప్రాజెక్టులో ఈ సొరంగ మార్గం అత్యంత కీలకమైంది. ప్రస్తుతం ఉన్న 7 ఫెర్రీ క్రాసింగ్‌లను తొలగించి.. మొత్తం తీరప్రాంత ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించాలని నార్వే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రొగ్‌ఫాస్ట్ సొరంగంలో వాహనాల రాకపోకల కోసం 2 వేర్వేరు ట్యూబ్‌లు ఉంటాయి. ఒక్కో ట్యూబ్ రెండు లేన్‌లతో నిర్మిస్తున్నారు. 260 మీటర్ల లోతులో ఉన్న డబుల్ రౌండ్‌అబౌట్.. క్వైట్స్‌యోయ్ ద్వీపానికి సొరంగ మార్గంలో కలుపుతుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అండర్ వాటర్ టెన్నెల్ నిర్మాణంలో ఇంజనీరింగ్ సవాళ్లు, సాంకేతిక విజయాలు
ప్రపంచంలోనే అత్యంత లోతైన సొరంగ మార్గాన్ని నిర్మించడం ఇంజనీరింగ్ నైపుణ్యాలకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ ప్రాజెక్ట్‌లో కొంత భాగాన్ని పర్యవేక్షిస్తున్న స్కాన్స్కా అనే ఇంటర్నేషనల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంతటి లోతైన నిర్మాణం చేపట్టడానికి అత్యాధునిక టెక్నాలజీ అవసరమని తెలిపింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేస్తున్న బృందాలు.. టన్నెల్ రెండు చివర్ల నుంచి.. పని చేస్తూ.. మధ్య భాగానికి చేరుకుంటున్నాయి. ఈ టన్నెల్‌లో అత్యంత లోతైన 392 మీటర్ల వద్ద.. చదరపు అంగుళానికి 570 పౌండ్లు (259 కిలోల) కంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని.. దాని వల్ల నిర్మాణాన్ని మరింత క్లిష్టతరం చేస్తుందని పేర్కొంటున్నాయి. సముద్రం నుంచి నీరు లీక్ కావడాన్ని తగ్గించేందుకు.. సొరంగం తవ్వకాల పురోగతిని ట్రాక్ చేయడానికి టీమ్ లేజర్ స్కానర్‌ల వంటి హైటెక్ పరికరాలను ఉపయోగిస్తున్నారు.
ఈ అండర్ వాటర్ టన్నెల్ నిర్మాణంతో ప్రస్తుతం ఉన్న ఫెర్రీ సేవలు నిలిచిపోయినా.. దీర్ఘకాలంలో దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని స్కాన్స్కా ప్రాజెక్ట్ మేనేజర్ అన్నే బ్రిట్ మోయెన్ వెల్లడించారు. రొగ్‌ఫాస్ట్ టన్నెల్ నిర్మాణంతో.. ప్రయాణ సమయం తగ్గించడం ద్వారా విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ సేవలు మరింత మెరుగవుతాయని తెలిపారు.
దీనివల్ల పశ్చిమ తీరం వెంబడి ఉన్న వ్యాపారాలకు, స్థానిక సీ ఫుడ్ ఇండస్ట్రీకి ప్రయోజనం చేకూరుతుందని ఆమె వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పర్యావరణానికి ఎలాంటి హానీ చేయకుండా ఉండేలా రూపొందించారు. ఇది నార్వే సుస్థిర ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ ఈ39 హైవే 2050 నాటికి పూర్తి కావాలని నార్వే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.