|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 02:13 PM
మధుమేహం, హృద్రోగాలు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు మెంతులు తీసుకుంటే.. వీటిలో కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. స్టెరాయిడల్ సాపోనిన్లు కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుని, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఉదయం పరగడుపున ఒక టీస్పూన్ మెంతుల పొడిని నీటితో తీసుకోవడం లేదా రాత్రి నానబెట్టి ఉదయం తినడం మంచిది. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గర్భిణీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే వాడాలి.
Latest News