|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:11 PM
'ఆపరేషన్ సిందూర్'పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, అందువల్ల క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ వ్యవహారం అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.మే నెలలో పాకిస్థాన్‌తో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సైనిక చర్యలో తొలిరోజే భారత్ ఓడిపోయిందని చవాన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పాక్ దళాలు భారత సైనిక విమానాలను కూల్చివేశాయని, ఫలితంగా భారత వైమానిక దళం కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు.
Latest News