|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:20 PM
భారత క్రికెట్ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌కు కీలక బాధ్యతలు లభించాయి. శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) తమ జాతీయ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్ ను నియమించింది. 2026లో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు ఈ పదవిలో కొనసాగుతాడు.శ్రీధర్ నియామకం ఈ నెల 11 నుంచి అమల్లోకి రాగా, 2026 మార్చి 10న అతడి ఒప్పందం ముగుస్తుంది. బీసీసీఐ లెవల్ 3 కోచ్ అయిన శ్రీధర్‌కు అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉంది. 2014 నుంచి 2021 వరకు ఏడేళ్ల పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా 300కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు సేవలందించాడు. అతడి హయాంలో భారత జట్టు రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లు ఆడింది.ఈ నియామకంపై శ్రీధర్ స్పందిస్తూ.. "శ్రీలంక ఆటగాళ్లు సహజమైన ప్రతిభ, పోరాట స్ఫూర్తికి ప్రసిద్ధి. నా పద్ధతులను వారిపై రుద్దకుండా, వారిలో అథ్లెటిసిజం, అవగాహన సహజంగా వృద్ధి చెందే వాతావరణాన్ని కల్పిస్తాను. ఆటగాళ్ల మధ్య సమన్వయం పెంచి, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ ఇస్తాను" అని తెలిపాడు.
Latest News