|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:12 PM
ఎంపీ గోరంట్ల మాధవ్ ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. మంత్రి నారా లోకేశ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు ఆయనను ప్రశ్నించారు. విచారణ అనంతరం, తదుపరి విచారణకు సహకరించాలని సూచిస్తూ సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి పంపించారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ రాప్తాడు పర్యటన సందర్భంగా పోలీసులు సరైన భద్రత కల్పించలేదని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మంత్రి నారా లోకేశ్‌పై తీవ్రమైన, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు, తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.టీడీపీ నేతల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగానే ఇవాళ ఆయనను విచారణకు పిలిపించారు. పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని నోటీసులు అందించారు.
Latest News