|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:39 PM
అక్రమ మార్గాల్లో విదేశాలకు పంపించే.. డంకీ రూట్ సిండికేట్ ఆటను రాజస్థాన్‌లోని జలంధర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారులు మట్టికరిపించారు. ఈనెల 18వ తేదీన ఒకేసారి ఢిల్లీ, పంజాబ్, హర్యానాలోని 13 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించగా.. ఒక ట్రావెల్ ఏజెంట్ వద్ద భారీ మొత్తంలో డబ్బు, బంగారం, వెండిని సీజ్ చేశారు. ఈ సోదాల్లో సుమారు రూ.19.13 కోట్ల విలువైన ఆస్తులను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా నుంచి.. బహిష్కరణకు గురైన 330 మంది భారతీయుల కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు చేశారు.
ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ ట్రావెల్ ఏజెంట్ నివాసం, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో సంపద బయటపడింది. అందులో నగదు రూ.4.62 కోట్లతోపాటు.. 313 కిలోల వెండి.. సుమారు రూ.7 కోట్ల విలువైన 6 కిలోల బంగారం దొరికింది. వీటి మొత్తం విలువ రూ.19.13 కోట్లు ఉంటుందని ఈడీ అధికారులు అంచనా వేశారు.
నగదు, బంగారం, వెండితోపాటు నిందితుల వద్ద నుంచి పెద్ద ఎత్తున మొబైల్ చాట్స్, డిజిటల్ సాక్ష్యాలు, విమాన టిక్కెట్లు, హవాలా మార్గాల ద్వారా జరిగిన లావాదేవీల రికార్డులను అధికారులు సేకరించారు. హర్యానాలోని ఒక ఏజెంట్ నివాసంలో జరిపిన సోదాల్లో అధికారులు ఒక కీలక విషయాన్ని గుర్తించారు. అమెరికా వెళ్లాలనుకునే వారి నుంచి.. డబ్బుకు బదులుగా ముందే వారి భూమి లేదా ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకునేవారు.
దీనివల్ల బాధితులు మధ్యలో వెనక్కి రాకుండా లేదా డబ్బులు ఎగ్గొట్టకుండా ఏజెంట్లు ప్లాన్ చేసేవారు. మెక్సికో సరిహద్దు ద్వారా అమెరికాలోకి ప్రవేశించేలా చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.45 లక్షల నుంచి.. రూ.55 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ప్రభుత్వం 330 మంది భారతీయులను.. తమ సైనిక విమానాల ద్వారా ఆ దేశం నుంచి బహిష్కరించి వెనక్కి పంపించింది. వారు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పంజాబ్, హర్యానా పోలీసులు దాదాపు 19 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీని వెనుక ఉన్న మనీ లాండరింగ్ కోణాన్ని వెలికితీసేందుకు ఈడీ రంగంలోకి దిగింది.
Latest News