|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 11:07 PM
ప్రపంచలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). అన్ని లీగ్‌ల్లో ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. భారతీయ ప్లేయర్లతో పాటు.. విదేశీ క్రికెటర్లు ఇందులో ఆడే అవకాశం దక్కాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో జరిగే ఐపీఎల్ వేలంలో.. ప్రతి ఏటా రికార్డులు మారుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 2025 ఐపీఎల్ మెగావేలంతో పాటు.. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలం కూడా రసవత్తరంగా సాగింది. క్యాప్డ్‌తో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్ల ధరలు కళ్లు చెదిరే స్థాయికి చేరుకున్నాయి. ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డు ధర పలికాడు. ఇతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.25.2 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా కామెరాన్ గ్రీన్ రికార్డు సృష్టించడం విశేషం. ఆ తర్వాత స్థానంలో రూ.18 కోట్లు శ్రీలంక ఆటగాడు మతీష పథిరన నిలిచాడు. ఇతడిని కూడా కేకేఆర్ కొనుగోలు చేసింది.
అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై కూడా కనక వర్షం కురిసింది. మతీష పథిరన తర్వాత స్థానంలో ఇద్దరు భారతీయ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. యంగ్ క్రికెటర్లు కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.2 కోట్ల చొప్పున వెచ్చింది కొనుగోలు చేసింది. వీరిద్దరే కాకుండా జమ్మూకాశ్మీర్ ప్లేయర్ ఆకిబ్ నబీ దార్, తేజస్వి దాహియా వంటి వారు కూడా మంచి ధర పలికారు. ఇక లియామ్ లివింగ్‌స్టోన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.13 కోట్లుకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో అన్ని టీమ్స్‌లో కలిపి అత్యంత ఖరీదైన భారతీయ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన భారతీయ ప్లేయర్లు..
రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ - రూ.18 కోట్లు (చైన్నై సూపర్ కింగ్స్)
రింకు సింగ్ - రూ.13 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్)
అక్షర్ పటేల్ - రూ.16.5 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
శుభ్‌మన్ గిల్ - రూ.16.5 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
రిషబ్ పంత్ - రూ.27 కోట్లు (లక్నో సూర్ జెయింట్స్- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికింది ఈ ప్లేయరే)
జస్ప్రీత్ బుమ్రా - రూ.18 కోట్లు (ముంబై ఇండియన్స్)
శ్రేయాస్ అయ్యర్ - రూ.26.75 కోట్లు (పంజాబ్ కింగ్స్ - ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర పలికింది ఈ ప్లేయరే)
విరాట్ కోహ్లీ - రూ.21 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
అభిషేక్ శర్మ - రూ.14 కోట్లు సన్ రైజర్స్ హైదరాబాద్.
యశస్వి జైస్వాల్ - రూ.18 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
Latest News