|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 11:18 PM
పసిడి ప్రియులకు ఎట్టకేలకు ఊరట లభించింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రెండు రోజుల తర్వాత తగ్గాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. తులం గోల్డ్ రేటు ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గింది. క్రితం రోజు పెరిగిన ధర కంటే రెండింతలు ధర తగ్గడం మంచి అవకాశమేనని చెప్పవచ్చు. అయితే మరి డిసెంబర్ 19వ తేదీన దేశంలోని ప్రముఖ జువెలరీ సంస్థలైన తనిష్క్, మలబార్, లిలితా, జొయాలుక్కాస్ వంటి వాటిల్లో 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు ఎంతెంత ఉందో పూర్తి జాబితా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ. 60 మేర దిగివచ్చింది. దీంతో ఇవాళ గ్రాము ధర రూ. 12,300 వద్ద ట్రేడవుతోంది. అంటే తులానికి ఆభరణాల గోల్డ్ రేటు రూ. 1,23,000 వద్దకు దిగివచ్చింది. ఇక స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర తులానికి రూ. 660 మేర దిగివచ్చింది. దీంతో తులం రేటు రూ. 1,34,180 వద్ద ట్రేడవుతోంది.
తనిష్క్ జువెలరీలో గోల్డ్ రేట్లు
తనిష్క్ జువెలరీలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 12,340 వద్ద ఉంది. ఇక 10 గ్రాములకు రూ. 1,23,400 వద్ద ట్రేడవుతోంది.
జొయాలుక్కాస్ జువెలరీలో గోల్డ్ రేట్లు
జొయాలుక్కాస్ జువెలరీలో ఈరోజు బంగారం ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు గ్రాముకు రూ. 12,300 వద్ద ఉంది. అయితే 10 గ్రాములు (తులం) రేటు రూ. 1,23,000 వద్ద ట్రేడవుతోంది.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జువెలరీలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 12,300 వద్ద ట్రేడవుతోంది. అదే తులం రేటు అయితే రూ. 1,23,000 వద్ద కొనసాగుతోంది.
లలితా జువెలరీలో బంగారం ధర
లలితా జువెలరీ సంస్థలో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు 12,300 వద్ద అమ్ముడవుతోంది. ఇక తులం రేటు చూసుకుంటే రూ. 1,23,000 వద్ద కొనసాగుతోంది.
కల్యాణ్ జువెలరీలో గోల్డ్ రేటు
కల్యాణ్ జువెలరీలోనూ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60 మేర తగ్గింది. దీంతో గ్రాము ధర రూ. 12,300 వద్ద ట్రేడవుతోంది. అలాగే తులం రేటు రూ. 1,23,000 వద్ద కొనసాగుతోంది.