|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:56 PM
అమెరికాలో ఔషధాల ధరలను భారీగా తగ్గిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై ప్రపంచంలో ఏ దేశంలోనైతే అత్యల్ప ధరకు మందులు లభిస్తాయో, అదే ధరకు అమెరికన్లకు కూడా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ ప్రైసింగ్’ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం అమెరికాకు మందులు ఎగుమతి చేసే భారత జనరిక్ ఫార్మా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.ఈ చారిత్రక ప్రకటన సందర్భంగా హెచ్‌హెచ్‌ఎస్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్, వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖ ఫార్మా కంపెనీల సీఈవోలు ట్రంప్ వెంట ఉన్నారు. దశాబ్దాలుగా అమెరికన్లు ప్రపంచంలోనే అత్యధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఇకపై మీకు ప్రపంచంలోనే అత్యల్ప ధర లభిస్తుంది" అని ఆయన హామీ ఇచ్చారు.
Latest News