|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:09 PM
అరటిపండులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వర్కౌట్‌కు ముందు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. భోజనం తర్వాత జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సాయంత్రం వేళల్లో జంక్ ఫుడ్‌కు బదులుగా అరటిపండు తినడం మంచిది. అయితే, జలుబు, దగ్గుతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ సరైన పద్ధతిలో అరటిపండు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
Latest News