|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 11:13 PM
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక్కటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. తమ కస్టమర్లకు నిరంతరాయంగా నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా తమ బ్యాంకింగ్ సిస్టమ్‌లో మెయింటెనెన్స్ ప్రక్రియను చేపడుతున్నట్లు ప్రకటించింది. మెయింటెనెన్స్ షెడ్యూల్ కారణంగా కొన్ని బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. డిసెంబర్ 21, 2025 ఆదివారం రోజున తెల్లవారు జామున 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పలు సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది.
కోటక్ బ్యాంక్ పాత యాప్ పని చేయదు
కొత్త కోటక్ బ్యాంక్ యాప్ సైతం ఆగిపోనుంది
కోటక్ 811 మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ సైతం నిలిచిపోతుంది
నెట్ బ్యాంకింగ్ సేవలు ఉండవు
యూపీఐ సహా ఇతర అనుబంధ సర్వీసులు ఉండవు
ఏటీఎం సేవులు నిలిచిపోనున్నాయి.
రూ.20 వేలకు తక్కువగా ఉండే ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ప్రభావం ఉండదు.
షెడ్యూల్ చేసిన డౌన్‌టైమ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందే తమ ఆర్థిక బ్యాంకింగ్ లావాదేవీలను ప్రణాళిక చేసుకోవాలని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. తమ ఖాతాదారులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, అయితే, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు సిస్టమ్ అప్డేట్ చేస్తున్నట్లు పేర్కొంది. కస్టమర్లు డౌన్‌టైమ్ సమయంలో బ్యాంకింగ్ సర్వీసులు పొందాలనుకుంటే ఇతర మార్గాలను అనుసరించాలని కోరింది.
కోటక్ 811 సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే పలు బెనిఫిట్స్ ఉంటాయి. ఈ అకౌంట్ ద్వారా ఉచిత వర్చువల్ డెబిట్ కార్డు లేదా ఫిజికల్ కార్డు లభిస్తుంది. తక్షణ యాక్టివేషన్‌తో పూర్తి స్థాయిలో డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ ఉంటుంది. యాక్టివ్ మనీతో ఈ అకౌంట్ ద్వారా ఏకంగా 5.75 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా ఉచితంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. సూపర్ సేవింగ్స్ అకౌంట్ యూజర్లకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ సైతం ఉంటాయి.
మరోవైపు జీరో బ్యాలెన్స్ అకౌంట్ నుంచి సూపర్ సేవింగ్స్ అకౌంట్‌కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా కస్టమర్ కేర్ ప్రతినిధితో కనెక్ట్ అయి ఈ ప్రక్రియను ఇంటి నుంచే పూర్తి చేయవచ్చు. కోటక్ 811 సేవింగ్స్ అకౌంట్‌కి అర్హత సాధించాలంటే మీరు భారతీయ పౌరులై ఉండాలి. 18 ఏళ్ల వయసు దాటిన వారికి అర్హత ఉంటుంది. వాలిడే కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. మీరు మీ ఇంటి నుంచే వీడియో కాల్ ద్వారానే కేవైసీ పూర్తి చేయవచ్చు. భారతీయ పౌరులు భారత్ లో ఉన్నట్లయితే ఈ ప్రక్రియ చాలా సులభంగా వేగంగా పూర్తవుతుంది.
Latest News