|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:48 PM
సామాన్యులకు అందుబాటులో ఉండే కోడి గుడ్ల ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. కొద్ది నెలల క్రితం రూ.5గా ఉన్న గుడ్డు ధర ఇప్పుడు రూ.8కి చేరుకుంది. హోల్‌సేల్ మార్కెట్లో రూ.7.30గా ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.8కి అమ్ముతున్నారు. 30 గుడ్ల ధర రూ.160-170 నుంచి రూ.210-220కి పెరిగింది. మరో రెండు నెలల పాటు ఇదే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్లతో పాటు చికెన్ ధరలు కూడా పెరిగాయి. నాటు కోడి గుడ్డు ధర రూ.15కి చేరింది.
Latest News