|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:59 PM
ప్రధాని మోదీ ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించి, వీర జవాన్ల పేరు పెట్టారు. ఇప్పుడు అక్కడి యంత్రాంగం సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తూ, జనావాసాలు లేని 586 దీవులకు పేర్లు సూచించాలని ప్రకటించింది. స్థానిక ఆదివాసీ వారసత్వం, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖులు, అమరులు, వృక్ష, జంతుజాలం, చారిత్రక సంఘటనలు, భౌగోళిక లక్షణాల ఆధారంగా పేర్లు సూచించవచ్చు. ప్రస్తుతం 586 దీవులకు పేర్లు లేవు, వాటిని ప్రత్యేక నంబర్లతో గుర్తిస్తున్నారు. పేర్లపై నిర్ణయం తర్వాత తుది ఆమోదం కోసం కేంద్ర హోం శాఖకు పంపిస్తారు.
Latest News