|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:02 PM
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ కోసం నేడు టీమిండియాను ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కు కూడా జట్టులో స్థానం లభించింది. దీనిపై స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. "నా తమ్ముడు సంజూ శాంసన్ ప్రపంచకప్ జట్టుకు ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక అతను అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు" అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు అద్భుతంగా ఉందని, టైటిల్ నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేశాడు.బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేడు భారత జట్టును ప్రకటించారు.
Latest News