|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:02 PM
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంకా పాత భ్రమల్లోనే బతుకుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు 'డైవర్షన్' రాజకీయాలకు తెరలేపుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల విషయంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంపై వైసీపీది ద్వంద్వ వైఖరని, వారి ఎంపీలు ఢిల్లీలో మద్దతుగా సంతకాలు పెట్టి, ఇక్కడ గల్లీలో జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. శనివారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు.గతంలో కోడికత్తి, గులకరాయి డ్రామాలతో ప్రజలను మోసం చేసిన జగన్, ఇప్పుడు 'కోటి సంతకాలు' అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని సవిత ఎద్దేవా చేశారు. "ప్రజలు మీ నాటకాలను గ్రహించి, మిమ్మల్ని రాజకీయాల నుంచి డైవర్షన్ చేసి ఇంటికి పంపారు. చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం" అని ఆమె అన్నారు.
Latest News