శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్
 

by Suryaa Desk | Sun, Dec 21, 2025, 08:35 PM

ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ప్రాజెక్టు శాటిలైట్లలో ఒకటి అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తోంది. ఆ శాటిలైట్ లోని ప్రొపల్షన్ ట్యాంకులో ఉన్న గ్యాస్ తీవ్ర వేగంతో బయటికొచ్చేసిందని, దాంతో ఆ శాటిలైట్ ఒక్కసారిగా 4 కిలోమీటర్ల కిందికి వచ్చేసిందని స్పేస్ ఎక్స్ సంస్థ వెల్లడించింది. డిసెంబరు 17 నాటికి భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఉపగ్రహం మరో వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుందని వివరించింది. అయితే, దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని, అదే సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కూడా ఎలాంటి ముప్పు లేదని స్పేస్ ఎక్స్ స్పష్టం చేసింది. భూవాతావరణంలోకి ప్రవేశించగానే, ఆ శాటిలైట్ కాలిపోతుందని తెలిపింది. కాగా, కూలిపోతున్న స్టార్ లింక్ శాటిలైట్ శకలాలను వరల్డ్ వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసింది.

Latest News
Indian rupee rises for 2nd session amid RBI interventions Mon, Dec 22, 2025, 11:21 AM
Australia mulls gas reservation for domestic use Mon, Dec 22, 2025, 10:49 AM
Delhi pollution: Air quality remains in ‘very poor’ category, smog persists Mon, Dec 22, 2025, 10:40 AM
Cattle smuggler injured, two arrested in police encounter in UP's Deoria Mon, Dec 22, 2025, 10:34 AM
NZ beat WI by 323 runs in third Test to seal series 2-0 Mon, Dec 22, 2025, 10:31 AM