బిగ్‌బాస్ తెలుగు 9 టైటిల్ గెలుచుకున్న కల్యాణ్ పడాల
 

by Suryaa Desk | Mon, Dec 22, 2025, 06:16 AM

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 ముగిసింది. ఎన్నో నాటకీయ పరిణామాలు, ఉత్కంఠభరిత క్షణాల మధ్య జరిగిన గ్రాండ్ ఫినాలేలో కల్యాణ్ పడాల విజేతగా నిలిచారు. హోస్ట్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఆయన ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నారు. తనూజ రన్నరప్‌గా నిలిచారు. కల్యాణ్ కు విన్నర్ చెక్ తో పాటు బ్రాండ్ న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ కారు, 'రాఫ్' నుంచి రూ.5 లక్షల చెక్ కూడా లభించడం విశేషం.ఫైనల్ రేసులో ఐదుగురు కంటెస్టెంట్లు నిలవగా, ఆదివారం జరిగిన ఫినాలేలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత నటి సంజన గల్రానీ ఐదో స్థానంతో ఎలిమినేట్ అయ్యారు. టాప్-3లో ఉంటానని భావించిన ఆమె ఈ ఫలితంతో షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత, టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా ఉన్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆయన ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.ఆ తర్వాత రూ. 15 లక్షల ఆఫర్‌కు డెమోన్ పవన్ అంగీకరించి, పోటీ నుంచి వైదొలిగారు. పవన్ నిష్క్రమణతో విజేత ప్రైజ్‌మనీ రూ. 50 లక్షల నుంచి రూ. 35 లక్షలకు తగ్గింది. చివరికి కల్యాణ్ పడాల అత్యధిక ఓట్లు సాధించి టైటిల్ గెలుచుకోగా, తనూజ రన్నరప్‌గా నిలిచారు. స్టార్ మా, జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఈ ఫినాలే ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ముంచెత్తింది.

Latest News
Indian rupee rises for 2nd session amid RBI interventions Mon, Dec 22, 2025, 11:21 AM
Australia mulls gas reservation for domestic use Mon, Dec 22, 2025, 10:49 AM
Delhi pollution: Air quality remains in ‘very poor’ category, smog persists Mon, Dec 22, 2025, 10:40 AM
Cattle smuggler injured, two arrested in police encounter in UP's Deoria Mon, Dec 22, 2025, 10:34 AM
NZ beat WI by 323 runs in third Test to seal series 2-0 Mon, Dec 22, 2025, 10:31 AM