స్థానిక సంస్థల విజయోత్సవాలలో అపశృతి
 

by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:13 PM

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. పూణేలో గెలిచిన ఓ అభ్యర్థి సాయంత్రం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న జేజురి ఆలయం ముందు మద్దతుదారులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆలయం ముందున్న ఖండరేయ భారీ విగ్రహం ముందు పసుపు జల్లగా.. విగ్రహం ముందున్న దీపం నుంచి మంటలు ఎగసిపడ్డాయి.ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో కౌన్సిలర్ గా ఎన్నికైన అభ్యర్థితో పాటు ఆయన మద్దతుదారులు 16 మంది ‌‌గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయపడ్డ వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ కౌన్సిలర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని సమాచారం.

Latest News
Bihar CM Nitish Kumar meets PM Modi in Delhi; discuss development and political issues Mon, Dec 22, 2025, 04:51 PM
Suryakumar Yadav to play two Vijay Hazare Trophy matches in Jan 2026 Mon, Dec 22, 2025, 04:45 PM
Coupang daily user count slips to 14 million range after data breach Mon, Dec 22, 2025, 04:43 PM
Rajnath Singh steers MoU between DRDO, Raksha University for R&D Mon, Dec 22, 2025, 04:42 PM
MP CM Mohan Yadav meets BJP Working President Nitin Nabin in Delhi Mon, Dec 22, 2025, 04:36 PM