|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:29 PM
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అండతో జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.ఎస్ఈ దేశీనాయక్, మేనేజర్ గంగాధర్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. అధికారులు పదవీ విరమణ చేసినా విడిచి పెట్టమని, వారి లెక్కలన్నీ సరిచేస్తామని పేర్కొన్నారు. వారి ఆస్తులను సైతం అమ్మించి అవినీతి సొమ్ము కక్కిస్తామని కాకాణి హెచ్చరించారు.
Latest News