|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:01 PM
ముంబై అండర్ వరల్డ్ డాన్ హజీ మస్తాన్ కుమార్తె హసీన్ మస్తాన్ మీర్జా తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తాను ఏళ్ల తరబడి లైంగిక హింసకు గురయ్యానని, తనకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. తన మాజీ భర్త, ఆయన కుటుంబంపై తాను చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. డబ్బు, రాజకీయ అండ లేకపోవడం వల్ల తనకు న్యాయం జరగడంలేదని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటేనే తనకు న్యాయం జరుగుతుందని అన్నారు.తన తండ్రి హజీ మస్తాన్ ఎంతోమందికి సాయం చేశాడని, ఆయన చనిపోయాకే తనకు కష్టాలు మొదలయ్యాయని హసీన్ తెలిపారు. 12 ఏళ్ల వయసులోనే తనకు బలవంతంగా పెళ్లి చేశారని, 14 ఏళ్ల వయసులో తనకు అబార్షన్ అయిందని ఆమె చెప్పారు. తన తండ్రి చనిపోయాక ఆయన ఆస్తుల కోసం తనను వేధింపులకు గురిచేశారని మాజీ భర్త కుటుంబంపై ఆరోపణలు చేశారు. ఏళ్ల తరబడి లైంగిక హింసకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.హజీ మస్తాన్ ఆస్తులన్నీ తమకే దక్కుతాయని తన మాజీ భర్త కుటుంబం ఆశించిందని చెప్పారు. అందుకోసమే తనపై అత్యాచారం చేశానని తన మాజీ భర్త చెప్పాడన్నారు. ఆస్తులు దక్కకపోవడంతో విడాకులు ఇచ్చి తనను నడి రోడ్డుపై వదిలేశారని, తన వద్ద డబ్బు ఏమీ లేదని హసీన్ వాపోయారు. మాజీ భర్త, ఆయన కుటుంబంపై 2013 నుంచి న్యాయపోరాటం చేస్తున్నానని హసీన్ చెప్పారు. అయితే, డబ్బు లేకపోవడంతో తన కేసు ముందుకు సాగడం లేదన్నారు.పోలీసులు కూడా తనకు ఎలాంటి సాయం చేయలేదని విమర్శించారు. పోలీసులు ఈ కేసును పక్కన పడేయకుండా ఉండేందుకు, తనకు న్యాయం జరిగేందుకు ప్రధాని మోదీ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Latest News