|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 07:16 PM
ట్విట్టర్ (ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్, యూట్యూబ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్స్ లో క్రియేటర్లకు ఇచ్చే రెవెన్యూ షేర్‌ను గణనీయంగా పెంచాలని మస్క్ తన బృందాన్ని ఆదేశించినట్లు సమాచారం. యూట్యూబ్ తరహాలోనే సుదీర్ఘ వీడియోల అప్‌లోడ్, మెరుగైన అల్గోరిథం, పెరిగిన యాడ్ రెవెన్యూ వాటా వంటి మార్పులతో క్రియేటర్లను ఆకర్షించాలని మస్క్ యోచిస్తున్నారు. భారత్ వంటి మార్కెట్లలో ఇది క్రియేటర్ ఎకానమీని గణనీయంగా ప్రభావితం చేయగలదు. అయితే యూట్యూబ్ వ్యవస్థను అధిగమించి, అవసరమైన టూల్స్, కాపీరైట్ ప్రొటెక్షన్ అందించగలదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Latest News