|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:17 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, అవి దుర్మార్గమైనవని మండిపడ్డారు. గురువారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, కేసీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు.“ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రాజనీతిజ్ఞుడు అని ప్రపంచమంతా కీర్తిస్తోంది. అలాంటిది... కేసీఆర్‌కు నచ్చితే ఎంత? నచ్చకుపోతే ఎంత?” అంటూ ఆనం మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో సుపరిపాలన అందిస్తున్నామని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని, కొందరు నాయకులు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రామరాజ్యం ప్రారంభమైందని అన్నారు. తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇంతటి సుపరిపాలన చూడలేదని, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Latest News