|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:21 PM
అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో యాషెస్ టెస్టు మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఆదివారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌తో ఆయన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలకనున్నాడు.రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ఖవాజా భావోద్వేగానికి లోనయ్యాడు. "నేనొక ముస్లింని, పాకిస్థాన్ నుంచి వచ్చిన నల్ల జాతీయుడిని. నేను ఆస్ట్రేలియా జట్టులో ఎప్పటికీ ఆడలేనని చాలామంది అన్నారు. కానీ, ఇప్పుడు నన్ను చూసి మీరూ సాధించవచ్చని నమ్ముతున్నా" అని అన్నాడు. అయితే, ఇటీవల తనపై వచ్చిన విమర్శల పట్ల ఖవాజా ఆవేదన వ్యక్తం చేశాడు. పెర్త్ టెస్టులో గాయం కారణంగా ఇబ్బంది పడితే.. తాను సోమరిపోతునని, స్వార్థపరుడని, జట్టు పట్ల నిబద్ధత లేదని మీడియా, మాజీలు విమర్శించారని, ఇవి జాత్యహంకార ధోరణులేనని పేర్కొన్నాడు.
Latest News