|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:03 PM
వంటల్లో రుచిని పెంచే వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. వెల్లుల్లిలోని అల్లిసిన్ రక్తప్రసరణను మెరుగుపరిచి, గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. నిత్యం వెల్లుల్లి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండి, రక్తనాళాలు విస్తరిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాపులను తగ్గించి, రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. అయితే, రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడేవారు వైద్యుల సలహా తీసుకోవాలి.
Latest News