|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 09:40 PM
దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సేవలు పొందాలన్నా ఆధార్ గుర్తింపు లేకుండా దాదాపు ఏ పని జరగని పరిస్థితి నెలకొంది.ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడం నుంచి బ్యాంక్ ఖాతా తెరవడం వరకు ప్రతి ప్రక్రియలో ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ప్రజలందరికీ అత్యంత అవసరమైన ఈ ఆధార్ కార్డు విషయంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కాలానుగుణంగా మార్పులు చేస్తూ వస్తోంది.ప్రజలు ఆధార్ సేవలను మరింత సులభంగా వినియోగించుకోవడంతో పాటు, దుర్వినియోగం జరగకుండా పారదర్శకతను పెంచే లక్ష్యంతో UIDAI కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే 2026 నుంచి ఆధార్‌కు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.2026 నుంచి ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, ఫొటోగ్రాఫ్ వంటి వివరాలను మార్చుకోవాలంటే తప్పనిసరిగా సరైన ఆధార పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ మార్పులకు ఇంత కఠినమైన నిబంధనలు లేకపోవడంతో చాలామంది సులభంగా వివరాలు మార్చుకునేవారు. అయితే ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టే ఉద్దేశంతో UIDAI ఈసారి నియమాలను మరింత కఠినతరం చేసింది.పుట్టిన తేదీ (Date of Birth) మార్పు చేయాలంటే జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. అలాగే చిరునామా (Address) మార్పు కోసం కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్, లేదా బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని UIDAI స్పష్టం చేసింది.ఇక పేరు మార్పు వంటి వివరాల కోసం పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, పెన్షన్ కార్డు, ప్రభుత్వ ఆరోగ్య పథక కార్డు, పాస్‌పోర్ట్, ఈ-పాన్, NREGA జాబ్ కార్డు, లింగ మార్పిడి గుర్తింపు కార్డు లేదా ప్రభుత్వాలు జారీ చేసిన ఫొటోతో కూడిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.
Latest News