|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 10:51 PM
xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్ గ్రోక్ను న్యూడ్ ఫోటోల వివాదం చుట్టుముట్టింది. గ్రోక్‌ను దుర్వినియోగం చేస్తూ, ఆకతాయిలు న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు.ప్రత్యేకంగా ప్రముఖుల ఫోటోలను న్యూడ్‌గా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ప్రస్తుత సమాజానికి సవాల్ విసురుతోంది. కొందరు ప్రైవేటు వ్యక్తుల ఫోటోలను కూడా ఉపయోగించి ఇమేజ్-జెనరేషన్ ప్రాంప్ట్స్ ద్వారా న్యూడ్ పిక్చర్స్ సృష్టిస్తున్నారు. ఈ చర్యల కారణంగా అమాయిక మహిళలు, చిన్న పిల్లలు ప్రమాదానికి గురవుతున్నారు. దీని పై కేంద్రానికి ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు చేశారు.గ్రోక్ అనేది ఎలన్ మస్క్ స్థాపించిన xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్. ఇది "truth-seeking AI"గా పిలవబడుతూ రియల్-టైమ్ సెర్చ్, రీజనింగ్, కోడింగ్, విజువల్ ప్రాసెసింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. అయితే, దీన్ని తప్పుదోవలో ఉపయోగిస్తూ ఆకతాయిలు కుప్పకూలుతున్నారు. ఈ పరిస్థితి AI వినియోగంలో నైతికత, భద్రత అంశాలపై విస్తృత చర్చకు కారణమైంది.
Latest News