|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 10:39 AM
AP: బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. జెట్టీ వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోటులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దాంతో బోటు నుంచి మత్స్యకారులు కిందికి దిగారు. ఈ ప్రమాదంలో బోటు దగ్ధమైంది. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.
Latest News