|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 12:41 PM
ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా కలిగిన చైనాలో జనాభా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 30 ఏళ్లుగా అమల్లో ఉన్న పన్ను మినహాయింపులను రద్దు చేయడంతో గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌ల ధరలు పెరిగాయి. జనవరి 1 నుంచి వీటిపై 13 శాతం విలువ ఆధారిత పన్ను అమల్లోకి వచ్చింది. పిల్లల విద్య, సంరక్షణ, వైద్య ఖర్చులు భారంగా భావిస్తూ యువత పెళ్లిని వాయిదా వేయడం, పిల్లలు పుట్టకపోవడం, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి కారణాలతో జనాభా తగ్గుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, లవ్ ఎడ్యుకేషన్, వివాహ ప్రోత్సాహకాలు వంటి చర్యలు చేపడుతోంది.
Latest News