|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:55 PM
తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం యేడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహించిన సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ కార్యకర్తలను అభినందించారు. ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇదే స్ఫూర్తితో ఇంకా బాగా పని చేయాలని ఆయన సూచించారు. అనంతరం, పార్టీ నుంచి వచ్చిన ఉత్తమ కార్యకర్తలకు మెమోంటోలను అందజేశారు.
Latest News