|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 07:15 PM
హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ మీద హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల అన్వేష్ మీద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఆధ్మాత్మిక నగరం తిరుపతి లోనూ అన్వేష్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. తిరుపతిలోని హిందూ సంఘాలు అన్వేష్ మీద మండిపడ్డాయి. హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు తిరుపతిలో నిరసనకు దిగాయి. అన్వేష్ ఫోటోలను చెప్పుతో కొడుతూ, అతని ఫోటోలకు నిప్పుపెట్టి నిరసన తెలియజేశారు. హిందూ దేవతల జోలికొస్తే తాటతీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం అన్వేష్‌ను అరెస్ట్ చేయాలంటూ తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
అన్వేష్ మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండించిన హిందూ సంఘాల ప్రతినిధులు.. అన్వేష్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. అన్వేష్‌ను యూట్యూబ్‌లో ఫాలో అయ్యేవారందరూ మరోసారి ఆలోచించుకోవాలన్నారు. అన్వేష్ తిరుపతికి వస్తే రెండుగా చీరేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
కొవ్వు గడ్డలు తగ్గేందుకు ఓ సింపుల్ చిట్కా చెప్పిన ఎక్స్‌పర్ట్, పాటిస్తే ఎలాంటి మందులు అవసరం లేకుండా ఇట్టే కరిగిపోతాయి
మరోవైపు యాక్టర్ శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హిందూ దేవతల ప్రస్తావన తెచ్చిన అన్వేష్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అన్వేష్‌ను దేశద్రోహిగా ప్రకటించాలని.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నాకూడా అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే అన్వేష్ మీద పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అన్వేష్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, సినీ నటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే ఖమ్మం జిల్లాలోని ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌లోనూ అన్వేష్ మీద కేసు నమోదైంది. హిందూ దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు చేసి.. హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ అన్వేష్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. వీటిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే తాను పక్కా హిందువునని.. హిందువుగా పుట్టా, హిందువుగానే చస్తానంటూ అన్వేష్ ఇటీవల వీడియో విడుదల చేశాడు. తనను హిందూ మతం నుంచి వెలివేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారని ఆరోపించారు.
Latest News