|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 11:59 AM
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ ఇంట్లో గీజర్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News