|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 12:24 PM
ఒడిశాలోని ధెంకనల్ జిల్లా మోటంగ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పూర్ గ్రామం సమీపంలో శనివారం అర్ధరాత్రి అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. బ్లాస్టింగ్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి క్వారీలో మట్టి, బండరాళ్లు విరిగిపడటంతో మరికొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Latest News