|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 03:44 PM
తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఏపీ వాళ్లు నీరు దోచుకుంటున్నారనే హరీశ్ రావు ఆరోపణల్లో వాస్తవం లేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆరోపణలకు ప్రజలు ఎన్నికల్లో సమాధానం చెప్పారని, అబద్ధపు ఆరోపణలతో ఓట్లు రావని అన్నారు. ఏడాదికి వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని రాయలసీమ వంటి ప్రాంతాలకు నీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సోమిరెడ్డి తెలిపారు.
Latest News