|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 10:14 AM
AP: ఏపీలోని కర్నూలు, కడప, రాజమహేంద్రవరం నుంచి ఇండిగో విమాన సర్వీసులను పెంచింది. రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు వారానికి 45 విమానాలు నడుస్తున్నాయి. కడప నుంచి హైదరాబాద్, చెన్నై సహా మూడు ప్రాంతాలకు వారానికి 14 విమానాలు, కర్నూలు నుంచి బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలకు వారానికి తొమ్మిది విమానాలు ప్రయాణిస్తున్నాయి. 2022 మార్చి నుంచి ఈ ప్రాంతాల్లో ఇండిగో సేవలు ప్రారంభించింది.
Latest News