|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 11:58 AM
అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు వెలి మండలం ఇరగయి పంచాయితీ పరిధిలోని ఉరుములు గ్రామంలో రోడ్డు మరమ్మతు పనులు నెలల తరబడి ఆలస్యం అవుతున్నాయి. కాంట్రాక్టర్ నెలకు ఒక బిట్టు చొప్పున పనులు చేస్తూ, రోడ్డు మధ్యలో సిప్స్ పోసి గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అనారోగ్యంతో ఉన్నా ఆటోలకు అవసరం నిమిత్తం వెళ్లి వచ్చే వారికి కష్టంగా ఉందని ఉరుములు వాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే పనులు ప్రారంభించి రోడ్డును క్లియర్ చేయకపోతే తామేమి చేయాలో తమకు తెలుసునని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. కాంట్రాక్టర్ వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు.
Latest News