|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 12:22 PM
రాత్రిపూట కనిపించే డయాబెటిస్ లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని వైద్యులు సూచిస్తున్నారు. తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం, కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు, మంటలు వంటివి డయాబెటిస్‌కు సంకేతాలు. కొన్నిసార్లు డయాబెటిస్ వల్ల చెమటలు, పీడకలలు కూడా రావచ్చు. అధిక షుగర్ స్థాయిలను శరీరం మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నించడం వల్ల రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. నోరు పొడిబారడం, కండరాల నొప్పులు, నిద్రలో అవాంతరాలు, విపరీతమైన ఆకలి కూడా డయాబెటిస్ సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
Latest News