|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 07:35 PM
వెనిజువెలా పరిస్థితి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. రాజ్య విస్తరణకు ప్రయత్నించేవారు, హిట్లర్, ముస్సోలినీ లాగా కనుమరుగవుతారని అన్నారు. ట్రంప్ తనను తాను గొప్పగా భావించుకుంటున్నారని, ప్రపంచం ఆయన ముందు మోకరిల్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మోదీ, ట్రంప్ ముందు ఎందుకు తలొగ్గుతున్నారో అర్థం కావడం లేదని, ఇది దేశానికి ప్రమాదకరమని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.
Latest News